18 ఏళ్ల యువకుడి చేతిలో ఓటమి.. బ్యాడ్మింటన్ వరల్డ్కప్ నుంచి  లక్ష్య సేన్ ఔట్

18 ఏళ్ల యువకుడి చేతిలో ఓటమి.. బ్యాడ్మింటన్ వరల్డ్కప్ నుంచి  లక్ష్య సేన్ ఔట్

Lakshya Sen: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్య సేన్‌కు కోర్టులో బిగ్గెస్ట్ షాక్ తగిలింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన లక్ష్యసేన్, అమెరికాకు చెందిన 18 ఏళ్ల కుర్రాడు, ప్రపంచ 92వ ర్యాంకర్ గారెట్ టాన్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఏకంగా 73 నిమిషాల పాటు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ హై-వోల్టేజ్ థ్రిల్లర్ మ్యాచ్‌లో టాన్ 19–21, 21–19, 21–17 తేడాతో సంచలన విజయం సాధించి టోర్నీలోనే మైండ్ బ్లాకింగ్ అప్‌సెట్ నమోదు చేశాడు టాన్.

తొలి గేమ్‌లో ఫైట్.. కానీ రెండో గేమ్‌లో టాన్ కంబ్యాక్: 

ఈ మ్యాచ్ ఆరంభం నుంచే లక్ష్య సేన్, గారెట్ టాన్ మధ్య పాయింట్ పాయింట్‌కి నెక్స్ట్ లెవెల్ ఫైట్ నడిచింది. తొలి గేమ్‌లో అమెరికా కుర్రాడు పవర్‌ఫుల్ స్మాష్‌లతో ఎటాక్ చేసినా, లక్ష్య సేన్ తన ఎక్స్‌పీరియన్స్‌తో నెట్ గేమ్‌ ప్లాన్ వర్కవుట్ చేసి 21–19తో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ సెకండ్ గేమ్‌లో పుంజుకున్న గారెట్ టాన్, ఆరంభం నుంచే లీడ్‌లో ఉంటూ 20–15తో గేమ్ పాయింట్‌కి వెళ్లాడు. ఆ సమయంలో లక్ష్య వరుసగా 4 పాయింట్లు సాధించి క్రేజీ కంబ్యాక్ ఇచ్చినప్పటికీ, టాన్ పవర్‌ఫుల్ స్మాష్‌తో 21–19తో ఆ గేమ్‌ను కైవసం చేసుకుని మ్యాచ్‌ను డిసైడర్‌కు తీసుకెళ్లాడు.

డిసైడర్‌లో యంగ్ ప్లేయర్ డామినేషన్: 

విజేతను నిర్ణయించే మూడో గేమ్‌లో 18 ఏళ్ల యంగ్ షట్లర్ టాన్ కంప్లీట్ డామినేషన్ ప్రదర్శించాడు. ఫస్ట్ హాఫ్‌లోనే 11–4 తో భారీ లీడ్ సాధించి లక్ష్యసేన్ ను ప్రెజర్‌లోకి నెట్టేశాడు. ఆ తర్వాత లక్ష్య సేన్ వరుసగా 6 పాయింట్లు సాధించి  10–12తో మ్యాచ్‌లోకి తిరిగొచ్చే ప్రయత్నం చేసినా, టాన్ ఏమాత్రం టెన్షన్ పడకుండా 17–12కి దూసుకెళ్లాడు. క్లైమాక్స్‌లో లక్ష్యసేన్ ఎంత ట్రై చేసినా గారెట్ టాన్ స్పీడ్‌ను మాత్రం అందుకోలేకపోయాడు.

సైలెంట్ అయిన స్టేడియం.. ఫ్యాన్స్‌కి తీవ్ర నిరాశ: 

చివర్లో టాన్ 21–17తో ఆఖరి పాయింట్ సాధించి విక్టరీ కొట్టడంతో స్టేడియంలోని హోమ్ ఆడియన్స్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. మెడల్ గ్యారెంటీ అనుకున్న టోర్నీ నుంచి లక్ష్య సేన్ ఇలా రెండో రౌండ్‌లోనే అవుట్ కావడం ఇండియన్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. మరోవైపు ఈ అద్భుత గెలుపుతో 18 ఏళ్ల అమెరికన్ కుర్రాడు గారెట్ టాన్ ఒక్కసారిగా బ్యాడ్మింటన్ వరల్డ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయాడు.