- ఆరు కిలోల బరువు తగ్గారని డాక్టర్ల వెల్లడి
న్యూఢిల్లీ: ప్రవేశ పరీక్షల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన ప్రదర్శన ఆదివారంతో 16వ రోజుకు చేరుకుంది.
ఈ ఆందోళనకు మద్దతుగా వాతావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన నిరాహార దీక్ష ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ సమయంలో ఆయన ఆరు కిలోల బరువు తగ్గారు. ఈ మేరకు డాక్టర్లు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. బీపీ 112/70గా, గుండె వేగం నిమిషానికి 72 సార్లు, బ్లడ్ షుగర్ స్థాయి 67గా నమోదయ్యాయని డాక్టర్లు తెలిపారు.
ఆయన శరీరంలో నీటి శాతం మెరుగ్గానే ఉందని, మానసికంగా చురుగ్గా ఉన్నారని చెప్పారు. అయితే, ఆయన బరువు 60.95కిలోలకు చేరకుందని, ఏడు రోజుల్లో 6 కిలోల బరువు తగ్గారని పేర్కొన్నారు.
