బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి..నల్గొండ జిల్లా ఖాజీరామారంలో విషాదం

బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి..నల్గొండ జిల్లా ఖాజీరామారంలో విషాదం

నల్గొండ, వెలుగు : సరదాగా ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయారు. ఈ ఘటన ఘటన నల్గొండ జిల్లా కనగల్ మండలం ఖాజీరామారంలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖాజీరామారం గ్రామానికి చెందిన గుండు సాయిచరణ్ (10), మధు (9) స్నేహితులు. 

శనివారం సాయంత్రం ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు కలిసి చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద చిన్నారుల చెప్పులు కనిపించడంతో వెంటనే బావిలోకి దిగి గాలించగా.. ఇద్దరి డెడ్ బాడీలు దొరికాయి.

 బావి వద్ద ఆడుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోయి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.