ఈసారి 4.5 కోట్ల మొక్కలు టార్గెట్.. వన మహోత్సవానికి HMDA రెడీ

ఈసారి 4.5 కోట్ల మొక్కలు టార్గెట్.. వన మహోత్సవానికి HMDA రెడీ
  • 45 ఫారెస్ట్​ బ్లాక్లు, పార్కుల అభివృద్ధికి సన్నాహాలు

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: వర్షా కాలం ప్రారంభం కావడంతో కోర్​ అర్బన్​ రీజియన్(క్యూర్) పరిధిలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటేందుకు హెచ్ఎండీఏలోని అర్బన్ ​ఫారెస్ట్రీ విభాగం రెడీ అవుతోంది. ఈ ఏడాది 45 ఫారెస్ట్ బ్లాక్ లను అభివృద్ధి చేసేందుకు అటవీ శాఖ హెచ్ఎండీఏను సంప్రదించింది.

భారీగా మొక్కలు నాటడంతో పాటు, గ్రీనరీ పెంపునకు చర్యలు తీసుకోనుంది. అలాగే, హెచ్ఎండీఏ పరిధిలోని మెయిన్​చౌరస్తాల్లో ఉన్న సెంట్రల్ మీడియన్లను కూడా డెవలప్​చేయనున్నారు. వాటితోపాటు రోడ్లకు రెండువైపులా అవెన్యూ ప్లాంటేషన్, కాలనీ పార్క్ ల అభివృద్ధి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్​స్టిట్యూషన్స్​లేక్ బ్యూటిఫికేషన్ పనులు చేపట్టనున్నారు.

గతేడాది వన మహోత్సవంలో 3.3 కోట్ల మొక్కలు నాటామని, ఈసారి రూ.300 కోట్లతో 4.5 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని అర్బన్​ఫారెస్ట్రీ డైరెక్టర్​ప్రసాద్​తెలిపారు. ఇందులో అధికారులతోపాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, కాలనీ సంఘాలను భాగస్వామ్యం చేయనున్నట్లు పేర్కొన్నారు.

హెచ్ఎండీఏ లేఔట్లలోనూ ప్లాంటేషన్, గ్రీనరీని అభివృద్ధి చేస్తామన్నారు. గ్రేటర్​లో పదేండ్లు దాటిన పార్కులను, 200కు పైగా ప్రభుత్వ, కాలనీ పార్కులను డెవలప్​చేయనున్నట్లు చెప్పారు. కాలనీ పార్కుల అభివృద్ధి కోసం ఆయా సంఘాల వారు అధికారులను సంప్రదిస్తే అవసరమైన మొక్కలు సరఫరా చేస్తారని తెలిపారు.