గోదావరికి జలకళ..భద్రాచలం వద్ద ఒక్క రోజులోనే 7.7 అడుగులు పెరిగిన నీటిమట్టం

 గోదావరికి జలకళ..భద్రాచలం వద్ద ఒక్క రోజులోనే 7.7 అడుగులు పెరిగిన నీటిమట్టం

భద్రాచలం, వెలుగు : గోదావరి నది జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ఉపనదులు, వాగుల్లో నీటి ప్రవాహం పెరిగింది. వాటిల్లోంచి వచ్చే వరదతో భద్రాచలం వద్ద గోదావరి కళకళలాడుతోంది. వేసవికాలంలో కనిష్టంగా 2.6 అడుగులకు పడిపోయిన గోదావరి నీటి మట్టం, ఆదివారం ఒక్క రోజులోనే 10.3 అడుగులకు చేరుకుంది. భద్రాచలంలో గోదావరి నీరు స్నానఘట్టాల వద్దకు చేరింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా గోదావరి బేసిన్ లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.