నార్త్ సౌండ్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో శ్రీలంక భారీ స్కోరు చేసింది. లాహిరు ఉడార (188), కమింద్ మెండిస్ (84), సోనాల్ దినుషా (92) రాణించడంతో.. తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు లంక తొలి ఇన్నింగ్స్‌ను 139.3 ఓవర్లలో 549/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
ధనంజయ్ డిసిల్వ (33) ఓ మాదిరిగా ఆడగా.. కుశాల్ మెండిస్ (33), సోనాల్ ఆరో వికెట్‌కు 143 రన్స్ జోడించారు. నిషాన్ మధుశంక (6), దినేశ్ చండిమల్ (1), మిలాన్ రత్నాయకే (15), ఇసితా వాజెసుందర (14) నిరాశపర్చారు. సీల్స్, షామెర్ చెరో రెండు వికెట్లు తీశారు.
తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విండీస్ కడపటి వార్తలందేసరికి 56 ఓవర్లలో 141/3 స్కోరు చేసింది. కావెమ్ హోడ్జ్ (30 బ్యాటింగ్), షై హోప్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బ్రెండన్ కింగ్ (17) విఫలమయ్యాడు.
