నోటీస్ పీరియడ్ 3 నెలలా ? అయితే నో ఛాన్స్.. ఉద్యోగులకి తలనొప్పిగా మారిన కంపెనీ రూల్స్..

 నోటీస్ పీరియడ్ 3 నెలలా ? అయితే నో ఛాన్స్.. ఉద్యోగులకి తలనొప్పిగా మారిన కంపెనీ రూల్స్..

రెడ్డిట్‌లో ఒక ఉద్యోగి షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు ఐటీ & కార్పొరేట్ సర్కిల్స్‌లో పెద్ద చర్చకు దారితీసింది. తనకున్న 90 రోజుల (3 నెలల) నోటీస్ పీరియడ్ వల్ల కొత్త ఉద్యోగం వెతుక్కోవడం చాలా కష్టంగా మారిందని ఆ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు.

 "ఇది నా ఒక్కడికే ఇలా అనిపిస్తోందా.. లేక ఈ రోజుల్లో 90 రోజుల నోటీస్ పీరియడ్ ఉంటే కెరీర్‌కు బ్రేకులు పడినట్లేనా ? నేను ఉద్యోగం మారాలని చాలా గట్టిగా ట్రై చేస్తున్నాను. కానీ, నోటీస్ పీరియడ్ 3 నెలలు అని చెప్పగానే రిక్రూటర్లు, హెచ్‌ఆర్‌లు అస్సలు ఇంట్రెస్ట్  చూపించడం లేదు. నేను ఎంత నచ్చజెప్పినా వారు వినడం లేదు." అని ఆ ఉద్యోగి వాపోయాడు.

తాను ప్రస్తుతం జూలై మధ్యలో పూర్తయ్యే ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో ఉన్నానని, ఆ వర్క్  ఫినిష్ చేసి గౌరవంగా బయటకు రావాలనుకుంటున్నానని చెప్పాడు. కానీ, 90 రోజుల మ్యాటర్ వినగానే హెచ్‌ఆర్‌లు అక్కడితోనే మాటలు కట్ చేస్తున్నారని అన్నాడు.

 అతని కంపెనీ మరీ టాప్ కంపెనీ కాకపోయినా, ఈ 3 నెలల నోటీస్ రూల్ గురించి రిక్రూటర్లందరికీ బాగా తెలుసని ఆయన పేర్కొన్నాడు.  నా టాలెంట్ ఏంటో చూపించే అవకాశం కూడా ఇవ్వకుండా, కేవలం నోటీస్ పీరియడ్ వల్లే నన్ను పక్కన పెట్టేస్తుంటే చాలా బాధగా ఉంది అని రాసుకొచ్చాడు.

ఈ 90 రోజుల నోటీస్ పీరియడ్ ఉచ్చు నుండి బయటపడటానికి ఏమైనా ఐడియాలు ఉన్నాయా ? అని అడుగుతూ.. మిగతా వారు ఇలాంటి సమయంలో ఏం చేస్తారు? నోటీస్ పీరియడ్ మొత్తం సర్వ్ చేస్తారా ? ముందే రిలీజ్ చేయమని కంపెనీతో మాట్లాడుకుంటారా ? లేక నోటీస్ పీరియడ్ బైఅవుట్ చేసే కంపెనీలకే అప్లయ్ చేస్తారా? అని నెటిజన్లను సలహా అడిగాడు.

ALSO READ : TCS, Infosys వల్ల రూ.57 లక్షలు పోయాయ్..

 ఈ పోస్ట్‌పై చాలా మంది స్పందిస్తూ.. "బ్రదర్, నువ్వు ఒక్కడివే కాదు, మేమంతా ఇదే కూడా అదే సిట్యువేషన్ ఫేస్  చేసాం" అంటూ బాధలను పంచుకున్నారు.

  నేను ఒక పెద్ద ఎంఎన్‌సీ కంపెనీలో చేస్తున్నాను, నా పరిస్థితి కూడా ఇంతే. 90 రోజులు అనగానే రిక్రూటర్లు అడ్రస్ లేకుండా పోతున్నారు. అలాగని చేతిలో ఆఫర్ లేకుండా రిజైన్ చేయడం ఈ రోజుల్లో పెద్ద  రిస్క్ లాంటిది" అని ఒకరు అన్నారు.

 నువ్వు ఎలాగూ జూలైలో ప్రాజెక్ట్ నుండి రిలీజ్ అవుతావు కాబట్టి.. కంపెనీ వాళ్లు నోటీస్ పీరియడ్ తగ్గించడానికి ఒప్పుకునే ఛాన్స్ ఉందని రిక్రూటర్లకు చెప్పు" అని ఇంకొకరు సలహా ఇచ్చారు.

 మరొక యూజర్ "ఆఫీషియల్‌గా 3 నెలలు ఉన్నా.. రిక్రూటర్లకు మాత్రం ఒకటిన్నర నెలలోనే వచ్చేస్తానని చెప్పి ముందు ఆఫర్ లెటర్ తీసుకో... ఆ తర్వాత చూసుకోవచ్చు" అంటూ  ఐడియా ఇచ్చాడు. 

 వర్క్ హ్యాండోవర్ త్వరగా చేసి, అవసరమైతే నోటీస్ పీరియడ్ బైఅవుట్ చేసైనా సరే త్వరగా జాయిన్ అవుతానని రిక్రూటర్‌కు నమ్మకం కలిగించు. అప్పుడే కనీసం ఇంటర్వ్యూ రౌండ్ వరకైనా వెళ్లగలవు అని మరికొందరు సూచించారు.