సౌర తుఫానుతో సూర్యుడి నుంచి శక్తివంతమైన కణాలు, అయస్కాంత క్షేత్రాలు వెలువడి భూమి వైపు దూసుకొస్తాయి. ఇవి భూమిని చేరి భూవాతావరణంలో అయస్కాంత క్షేత్రంతో పరస్పరం చర్య జరుపుతాయి. వీటి ప్రభావంతో ఉపగ్రహాలు, జీపీఎస్, కమ్యూనికేషన్ వ్యవస్థలు, విద్యుత్ గ్రిడ్‌లపై ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు, ఈ సౌర తుఫానుల కారణంగా ఆకాశంలో రంగురంగుల అరోరాస్ కనువిందు చేస్తాయి. అసలు సౌర తుఫానులు ఎలా సంభవిస్తాయి? భూమిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? మనుషులకు ప్రమాదం ఉందా? తెలుసుకుందాం.
సౌర తుఫానుతో సూర్యుడి నుంచి వెలువడే శక్తివంతమైన కణాలు భూమి అయస్కాంత క్షేత్రంతో పరస్పరం చర్య జరిపినప్పుడు రాత్రిసమయంలో ఆకాశంలో ఆకుపచ్చ, గులాబీ, ఎరుపు, ఊదా రంగుల్లో మెరిసే కాంతులు వెలువడతాయి . కనిపించే ఈ అద్భుత దృశ్యాలనే అరోరాస్ అంటారు. సౌర తుఫానులతో సంబంధం ఉన్న ఈ అద్భుతాలు చూపరులను కట్టిపడేస్తుంది.
సౌర తుఫాను కారణం
సూర్యుడి నుంచి వెలువడే విద్యుత్ ఆవేశం కలిగిన కణాలు భూమి వైపు దూసుకొస్తాయి. భూమి అయస్కాంత క్షేత్రం ఈ కణాల్లో చాలావాటిని ధ్రువ ప్రాంతాల వైపు మళ్లిస్తుంది. అక్కడ అవి వాతావరణంలోని ఆక్సిజన్, నైట్రోజన్ వాయువులను ఢీకొంటాయి. ఈ సమయంలో శక్తి విడుదలై రంగురంగుల కాంతులు ఏర్పడతాయి. ఆక్సిజన్ వల్ల సాధారణంగా ఆకుపచ్చ, ఎరుపు రంగులు, నైట్రోజన్ వల్ల నీలం, ఊదా రంగులు కనిపించవచ్చు.
ఉత్తర ధ్రువ ప్రాంతాల్లో కనిపించే అరోరాస్‌ను అరోరా బొరియాలిస్ (Northern Lights) అంటారు. నార్వే, ఐస్‌లాండ్, ఫిన్లాండ్, స్వీడన్, కెనడా, అలాస్కా ప్రాంతాల్లో వీటిని చూడవచ్చు. దక్షిణ ధ్రువ ప్రాంతాల్లో కనిపించే కాంతులను అరోరా ఆస్ట్రాలిస్ (Southern Lights) అంటారు. అంటార్కిటికా, దక్షిణ న్యూజిలాండ్ వంటి ప్రాంతాల్లో ఇవి కనిపిస్తాయి.
సాధారణంగా భారత్‌లో అరోరాస్ కనిపించడం చాలా అరుదు. అయితే అత్యంత తీవ్రమైన భూ అయస్కాంత తుఫానులు వచ్చినప్పుడు ఈ కాంతులు సాధారణంగా కనిపించే ప్రాంతాల కంటే తక్కువ అక్షాంశాల వైపున కూడా కనిపించే అవకాశం ఉంటుంది.
అరోరాస్ చూడటానికి చీకటి ఆకాశం, తక్కువ కాంతి కాలుష్యం, అనుకూలమైన అంతరిక్ష వాతావరణ పరిస్థితులు అవసరం. ఇవి చూడటానికి అద్భుతంగా ఉన్నప్పటికీ, వీటి వెనుక సూర్యుడి శక్తి, భూమి అయస్కాంత క్షేత్రం, వాతావరణంలోని వాయువుల మధ్య జరిగే సంక్లిష్టమైన శాస్త్రీయ ప్రక్రియ ఉంది.
సౌర తుఫానులు భూమిపై టెక్నికల్ వ్యవస్థలకు కొన్ని సందర్భాల్లో ముప్పుగా మారినా, అవి సృష్టించే అరోరాస్ మాత్రం ప్రకృతి అందాలకు అద్దం పడతాయి. సూర్యుడి నుంచి వచ్చే కణాలు, భూమి అయస్కాంత క్షేత్రం, వాతావరణంలోని వాయువుల మధ్య జరిగే చర్యలే ఈ అద్భుత కాంతులకు కారణం. శాస్త్రవేత్తలు అంతరిక్ష వాతావరణాన్ని నిరంతరం పరిశీలిస్తూ సౌర తుఫానుల ప్రభావాలను అంచనా వేస్తున్నారు.
Multiple solar storms have launched from the Sun over the last few days, and the first #spaceweather impacts have begun here at 1 AU as more waves of plasma are soon to arrive. NOAA expects minor to moderate (G1-G2) geomagnetic storming, and it's possible it goes higher... https://t.co/tcZs8bCmZo
— Stefan Burns (@StefanBurnsGeo) October 9, 2026
