హైదరాబాద్, వెలుగు: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో ఏఐ ఆధారిత హెల్త్ ప్లాట్‌ఫారమ్ మెంథ్రా ‘హ్యూమన్ అడ్వాంటేజ్’ పేరుతో ప్రత్యేక సదస్సు నిర్వహించింది. ఏఐ శరవేగంగా విస్తరిస్తున్న నేటి యుగంలో మనుషుల సహజమైన ఆలోచనలు, భావోద్వేగాలు ఎంత విలువైవనే అంశంపై చర్చించారు.
ఏఐతో పాటు పోటీపడి రాణించాలంటే భావోద్వేగ స్థిరత్వం (ఎమోషనల్ వెల్బీంగ్), మానసిక దృఢత్వం, బంధాలు, సృజనాత్మకత, సమర్థ నాయకత్వ లక్షణాలు అత్యంత కీలకమని నిపుణులు స్పష్టం చేశారు.
భవిష్యత్తు అంటే కేవలం తెలివైన టెక్నాలజీని నిర్మించడం మాత్రమే కాదని, మానసికంగా మరింత బలమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడమేనని మెంథ్రా వ్యవస్థాపకుడు దినకర నాగళ్ల పేర్కొన్నారు. టెక్నాలజీ, వ్యాపారం, వైద్యం, విద్యారంగాల ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
