ఇవాళ ( 11న ) మళ్లీ చలో జంతర్ మంతర్.. దేశ వ్యాప్తంగా శాసనోల్లంఘన..వీధి పోరాటాలకు వెనుకాడం..

ఇవాళ ( 11న ) మళ్లీ చలో జంతర్ మంతర్.. దేశ వ్యాప్తంగా శాసనోల్లంఘన..వీధి పోరాటాలకు వెనుకాడం..

న్యూ ఢిల్లీ: పోలీసు నిర్బంధాలతో వెనక్కి తగ్గేది లేదని సీజేపీ తేల్చిచెప్పింది. తమ పార్టీ నాయకులను నిర్బంధించినంత మాత్రన ఉద్యమం ఆగబోదని  తేల్చి చెప్పింది. ఆదివారం మరోమారు జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. 

జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి దిగిపోయేదాకా దేశవ్యాప్తంగా శాసనోల్లంఘన కార్యక్రమం చేపట్టనున్నట్టు ప్రకటించింది. అయినా దిగిరాని పక్షంలో వీధి పోరాటాలకూ వెనుకాడేది లేదని తేల్చి చెప్పింది.