వాషింగ్టన్: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో శనివారం దారుణం జరిగింది. ఈరీ నగరంలోని ఓ ఇంటి లోపల, బయటా గుర్తుతెలియని వ్యక్తి తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పలువురు చిన్నారులతో సహా మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. కాల్పుల తర్వాత నిందితుడు తనను తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు.
తమ కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత హృదయవిదారకమైన దృశ్యాల్లో ఇది ఒకటని తెలిపారు. మృతులకు సంబంధించిన వివరాలను, నిందితుడి గుర్తింపును అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అలాగే, ఈ దాడికి గల అసలు కారణం ఏమిటనే దానిపై ప్రస్తుతం స్పష్టత రాలేదు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
