సుప్రీంకోర్టు దగ్గర హైడ్రామా.. సీజేపీ నిరసనకు వెళ్తున్న లాయర్లను అడ్డుకున్న పోలీసులు

సుప్రీంకోర్టు దగ్గర హైడ్రామా.. సీజేపీ నిరసనకు వెళ్తున్న లాయర్లను అడ్డుకున్న పోలీసులు
  • 60 మంది అరెస్ట్.. సీజేఐ జోక్యంతో విడుదల

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు దగ్గర హైడ్రామా నెలకొంది. సీజేపీ నిరసనకు వెళ్తున్న 60 మంది లాయర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై సుప్రీంకోర్టు బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎస్సీబీఏ) సీరియస్​ అయ్యింది. న్యాయవాదుల నిర్బంధాన్ని సహించబోమని ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీఏ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రదీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్​లో పోస్టు చేశారు. ఇది అన్యాయమని, వారిని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. 

ఈ విషయంలో సీజేఐ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సూర్యకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోక్యం చేసుకోవడంతో వారందరూ గంటల వ్యవధిలోనే విడుదలయ్యారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. 

ఈ నేపథ్యంలో ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే, సీజేపీకి మద్దతుగా సుప్రీంకోర్టు లాయర్లు నిరసన చేపట్టారు. శనివారం ఉదయం అత్యున్నత న్యాయస్థానం నుంచి జంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ర్యాలీగా బయలుదేరారు. ఈక్రమంలో సీనియర్, మహిళా న్యాయవాదులతో సహా సుమారు 60 మందిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.