ఫ్లైదుబాయ్ ఘటనపై ఎన్ఐఏ ఎంట్రీ..ఉగ్రవాద చట్టాల కింద కేసు

ఫ్లైదుబాయ్ ఘటనపై ఎన్ఐఏ ఎంట్రీ..ఉగ్రవాద చట్టాల కింద కేసు

న్యూఢిల్లీ: ఇటీవల ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై జరిగిన దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. విమానాన్ని హైజాక్ చేయడానికి లేదా కూల్చివేయడానికి జరిగిన ప్రయత్నంగా భావిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఈ కేసు ఫైల్​చేశారు. 

ఈ ఘటనపై యాంటీ హైజాకింగ్ యాక్ట్, 2016 సెక్షన్ 3, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) 1967 కింద కేసులు రిజిస్టర్ చేశారు. సెప్టెంబర్ 30న 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో దుబాయ్ నుంచి బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానం కాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఒమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన కో-పైలట్ కత్తితో దాడి చేశాడు. 

అబుదాబి ఆస్పత్రిలో శస్త్రచికిత్స పొందిన ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. భారత విదేశాంగ శాఖ, యూఏఈలోని భారత రాయబారి దీపక్ మిట్టల్ స్మిత్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భారతీయ పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దాడి, విమానాన్ని హైజాక్ చేసే ప్రయత్నం వంటి తీవ్రమైన అంశం కావడంతో కేంద్రం ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించింది. ప్రస్తుతం ఈ దాడికి గల కారణాలు,  ఎలా ప్లాన్ చేశారనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు, సౌదీ, యూఏఈ, ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఈ ఘటనపై వేర్వేరుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి.