న్యూఢిల్లీ: భారతీయ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ విమర్శల దాడిని మరింత పెంచారు. భారత్‌లో తన 'స్టార్‌లింక్' శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల అనుమతులు ఆలస్యమవుతుండడంతో మస్క్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రిలయన్స్ సంస్థకు బీజేపీతో ఉన్న సంబంధాలు, రాజకీయ విరాళాలకు సంబంధించిన పాత మీడియా కథనాలు, స్క్రీన్‌షాట్లను ఆయన 'ఎక్స్'లో షేర్ చేశారు.
గతంలో అల్ జజీరా ప్రచురించిన " రిలయన్స్ నిధులతో నడిచే సంస్థ ఫేస్‌బుక్‌లో బీజేపీ క్యాంపెయిన్లను ఎలా బూస్ట్ చేస్తోంది " అనే కథనాన్ని, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రిలయన్స్ అనుబంధ సంస్థ ‘క్విక్ సప్లై’ బీజేపీకి రూ. 385 కోట్లు, శివసేనకు రూ. 25 కోట్లు విరాళంగా ఇచ్చిందంటూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రచురించిన రిపోర్టును మస్క్ షేర్ చేశారు.
