జోగులాంబ గద్వాల జిల్లాలో మెడికల్ పోస్టులు

జోగులాంబ గద్వాల జిల్లాలో మెడికల్ పోస్టులు

జోగులాంబ గద్వాల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ (డీఎంహెచ్ఓ, జోగులాంబ గద్వాల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • మొత్తం ఖాళీలు: 48.
  • విభాగాల వారీగా ఖాళీలు: లాబ్ టెక్నీషియన్ 4,  ఎంఎల్​హెచ్​పీ/ సీహెచ్/ ఎంఓ – పల్లె దవాఖాన 18, ఫిజీషియన్ – ఎంబీబీఎస్/ ఎండీ 1, ఫిజియోథెరపిస్ట్ 1, స్టాఫ్​నర్స్ 5, ఏఎన్ఎం 1, 2వ ఏఎన్ఎం 2, ఫార్మసిస్ట్ 5, పీడియాట్రిషియన్ 3, ఓబీజీ స్పెషలిస్ట్ 1, ఎస్​టీఎల్ఎస్ 2, ఆయూష్ డాక్టర్ 3, డైటీషియన్ 1, సైకోసోషల్ కౌన్సెలర్, యోగా ప్రొఫెషనల్ 1, మల్టీ పర్సస్ వర్కర్ 2.
  • విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంటర్మీడియట్​తోపాటు ఎంఎల్​​టీ లేదా డీఎంఎల్​టీ లేదా బీఎస్సీ (ఎంఎల్​టీ), డిప్లొమా, డి.ఫార్మసీ/ బి.ఫార్మసీ/ ఫార్మ్.డి, ఏఎన్ఎం/ ఎంపీహెచ్​డబ్ల్యూ (మహిళ), జీఎన్ఎం/ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎంబీబీఎస్, ఎండీ పూర్తిచేసి ఉండాలి. 
  • వయసు:18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్​లకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
  • అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.
  • అప్లికేషన్ ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్ అభ్యర్థులు 
  • రూ. 300, ఓసీ, ఓబీసీలు రూ.500 చెల్లించాలి.
  • లాస్ట్ డేట్: అక్టోబర్ 13.
  • సెలెక్షన్ ప్రాసెస్: ఎంపిక ప్రక్రియకు మొత్తం 100 మార్కులను ప్రాతిపదికగా తీసుకుంటారు. అభ్యర్థులు సంబంధిత అర్హత పరీక్షలో  సాధించిన మార్కులకు 90 శాతం వెయిటేజీ ఇస్తారు. వయసు ఆధారంగా గరిష్టంగా 10 మార్కులు కేటాయిస్తారు. 
  • మరిన్ని వివరాలకు వెబ్​సైట్ gadwal.telangana.gov.inను సందర్శించండి.