న్యూఢిల్లీ: దేశీయ స్మాల్, మిడ్ క్యాప్ కంపెనీలు సెప్టెంబర్ క్వార్టర్లో లార్జ్ క్యాప్ సంస్థల కంటే మెరుగైన లాభాలను సాధించే అవకాశం ఉందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గన్ రిపోర్ట్ అంచనా వేసింది. దీని ప్రకారం..భారీ మూలధన పెట్టుబడులు, ఆధునిక తయారీ రంగం, ఏఐ డేటా కేంద్రాల విస్తరణ వంటి అంశాలు చిన్న సంస్థల వృద్ధికి దోహదపడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో నిఫ్టీ–50 కంపెనీల ఆదాయాలు 17 శాతం, నికర లాభాలు 16 శాతం పెరగవచ్చని పేర్కొంది.
