హైదరాబాద్, వెలుగు : సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కొన్ని రోజులుగా ఢిల్లీలో చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్తోపాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఆది, సోమవారాల్లో ఢిల్లీ వెళ్తున్నారు.
కేసీ వేణుగోపాల్ సూచనలతో పీసీసీ చీఫ్ ఆదేశాల మేరకు పలువురు పీసీసీ నేతలు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ఆదివారం సాయంత్రమే ఢిల్లీ చేరుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సోమవారం ఉదయం కల్లా వీరంతా ఢిల్లీకి చే రుకొని ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు పార్టీవర్గాల ద్వారా తెలిసింది.
