ఓఎంసీల కోసం ఆర్బీఐ డాలర్ విండో

ఓఎంసీల కోసం ఆర్బీఐ డాలర్ విండో

న్యూఢిల్లీ: రూపాయి విలువ తగ్గుతూనే నేపథ్యంలో ఆర్​బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓంఎసీలు) మొత్తం రోజువారీ డాలర్ అవసరాలను తీర్చడానికి ప్రత్యేక విండోను ప్రకటించింది.

కొన్ని బ్యాంకుల ద్వారా చమురు కంపెనీలకు డాలర్లు అమ్ముతారు. ఈ వెసులుబాటు ఈనెల 12 నుంచి అందుబాటులోకి వస్తుంది. రూపాయి శుక్రవారం 96.71 వద్ద ముగిసింది. కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి క్రూడ్​కొనడానికి డాలర్లలో చెల్లించాలి. ఈ విండో వల్ల అవి మార్కెట్​నుంచి అధిక ధరకు డాలర్లను కొనాల్సిన అవసరం తప్పుతుంది.