రాజకీయాల కోసం ఓరుగల్లును ముక్కలు జేసిన్రు: వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి

రాజకీయాల కోసం ఓరుగల్లును ముక్కలు జేసిన్రు: వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి

వరంగల్‍, వెలుగు: ఉమ్మడి ఓరుగల్లు జిల్లాను కేసీఆర్ ప్రభుత్వం స్వార్థ రాజకీయాల కోసం ఆరు ముక్కలుగా విడగొట్టిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి మండిపడ్డారు. గ్రేటర్ వరంగల్ నగరాన్ని రెండు జిల్లాలుగా విభజించడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి, కుడా చైర్​పర్సన్ గుండు సుధారాణితో కలిసి కాంగ్రెస్ నేతలు శనివారం డీసీసీ భవన్ నుంచి నల్లజెండాలతో ర్యాలీ నిర్వహించారు. 

అశోక థియేటర్ జంక్షన్‌‌‌‌‌‌‌‌లో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ ఓరుగల్లు కేంద్రంగా సాగిన ప్రజా ఉద్యమాలు తమ రాజకీయాలకు ఇబ్బందిగా మారడంతోపాటు, సిద్దిపేట జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌ను ఆరు జిల్లాలుగా, రాజకీయ ఐక్యతకు ప్రతీకగా ఉన్న నగరాన్ని రెండు ముక్కలుగా విభజించారని ఆరోపించారు. 

కాకతీయుల చరిత్ర, ఖిలా వరంగల్, వెయ్యిస్తంభాల గుడి వంటి చారిత్రక కట్టడాల ప్రాధాన్యతను తగ్గించే కుట్ర చేశారని విమర్శించారు. ఈ విభజనతో వరంగల్ అభివృద్ధికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.