హైదరాబాద్, వెలుగు: ఏఐ టెక్నాలజీలతో తక్కువ ఖర్చుతో సినిమాలను తీయడం గురించి చర్చించడానికి గ్యాలరీ5 ఏఐ స్టూడియో సంస్థ హైదరాబాద్లో శనివారం నెక్స్ట్ ఇన్ ఏఐ సదస్సును నిర్వహించింది. ఈ సందర్భంగా ఏఐ టెక్నాలజీల గురించి వివరించింది.
ఇప్పటి వరకు సోషల్ మీడియా, ఫోన్లకే పరిమితమైన ఏఐ వీడియోలను థియేటర్లకు చేర్చడమే తమ లక్ష్యమని ప్రకటించింది. స్టార్ ప్లస్, జియోహాట్ఓటీటీల్లో ప్రసారమైన మహాభారత్ సీరియల్‌ను ఏఐ టెక్నాలజీలతో రూపొందించారు.
ప్రస్తుతం స్టార్ స్టూడియో 18 భాగస్వామ్యంతో చిరంజీవి హనుమాన్ పూర్తి స్థాయి ఏఐ చిత్రాన్ని థియేటర్ల కోసం సిద్ధం చేస్తున్నారు. ఈ సదస్సులో 4కే సినిమా నాణ్యత, ఏఐ ఆధారిత వీఎఫ్ఎక్స్, డిజిటల్ పాత్రల సృష్టి విధానాలను ప్రదర్శించారు. సినీరంగానికి బలమైన కేంద్రమైన హైదరాబాద్ వేదికగా కొత్త తరం నిర్మాణ పద్ధతులను ఆవిష్కరిస్తున్నామని గ్యాలరీ5 సీఈవో రాహుల్ రేగులపాటి తెలిపారు.
