కోల్ కతా నుంచి హైదరాబాద్ కు కారులో.. రూ. 9 కోట్ల విలువైన విదేశీ బంగారం... కట్ చేస్తే, విశాఖ హైవే మీద...!

కోల్ కతా నుంచి హైదరాబాద్ కు కారులో.. రూ. 9 కోట్ల విలువైన విదేశీ బంగారం... కట్ చేస్తే, విశాఖ హైవే మీద...!

విశాఖ జాతీయరహదారిపై భారీగా విదేశీ బంగారం స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. పక్కా సమాచారంతో ఆదివారం ( అక్టోబర్ 11 ) విశాఖ జాతీయరహదారిపై నిఘా పెట్టిన డీఆర్ఐ అధికారులు రూ.8.98 కోట్ల విలువైన విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

కోల్కతా నుంచి హైదరాబాద్ కు కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.8.98 కోట్ల విలువైన 5.83 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కారులో 3 ప్యాకెట్లలో ఉన్న బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు.

భారీగా బంగారం పట్టుబడటంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు అధికారులు. బంగారం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎలా తీసుకొచ్చారు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.