మిర్యాలగూడలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న ఫ్యామిలీ !

మిర్యాలగూడలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న ఫ్యామిలీ !

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపుర ప్రాంతంలో ప్యారగాన్ చెప్పుల దుకాణం ఉన్న బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్లో పై అంతస్తులో ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మంటల్లో, దట్టమైన పొగలో చిక్కుకుపోయారు. 

మంటల్లో చిక్కుకున్న ఐదుగురు కుటుంబ సభ్యులను మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్, ఫైర్ సిబ్బంది కాపాడారు. మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించడంతో భవనంలో చిక్కుకున్న కుటుంబ సభ్యులు బయటకు రాలేక ఆర్తనాదాలు చేశారు.

సమాచారం అందుకున్న మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మంటలను అదుపు చేసి భవనంలో చిక్కుకున్న ఐదుగురు కుటుంబ సభ్యులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రాణాలకు తెగించి సహాయం చేసిన మిర్యాలగూడ ఫైర్ సిబ్బంది, వన్ టౌన్ పోలీస్ సిబ్బందిని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.