ఇండియా, వెస్టిండీస్‌‌‌‌ మూడో టీ20.. బ్యాట్ల మధ్యే పోరాటం

ఇండియా, వెస్టిండీస్‌‌‌‌ మూడో టీ20.. బ్యాట్ల మధ్యే పోరాటం
  • గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు
  • బ్యాటింగ్‌‌‌‌కు అనుకూలంగా హోల్కర్‌‌‌‌ పిచ్‌‌‌‌
  • రా. 7 నుంచి స్టార్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌లో లైవ్‌‌‌‌

ఇండోర్‌‌‌‌: ఇండియా, వెస్టిండీస్‌‌‌‌ మధ్య మూడో టీ20 మ్యాచ్‌‌‌‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం హోల్కర్‌‌‌‌ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌‌‌‌లోనూ ఇరుజట్ల బ్యాటింగ్‌‌‌‌ మధ్యే ప్రధాన పోరాటం జరగనుంది. రెండో టీ20లో పరుగులను ఆపలేక తీవ్ర ఒత్తిడికి లోనైన బౌలర్లపై ఈ మ్యాచ్‌‌‌‌ కూడా అంతే స్థాయిలో ప్రభావం చూపించనుంది.

రాంచీ మ్యాచ్‌‌‌‌లో ఏకంగా 501 రన్స్‌‌‌‌ నమోదు కావడంతో హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ గౌతమ్‌‌‌‌ గంభీర్‌‌‌‌ బౌలర్లపై ప్రత్యేక దృష్టి పెట్టినా.. ఇప్పటికిప్పుడు తక్షణ ఉపశమనం లభించే చాన్స్‌‌‌‌ అయితే కనిపించడం లేదు. ఎందుకంటే హోల్కర్‌‌‌‌ స్టేడియంలో పిచ్‌‌‌‌ ఫ్లాట్‌‌‌‌గా ఉంది. బౌండ్రీ లైన్‌‌‌‌ చిన్నగా ఉండటం వల్ల సాంప్రదాయకంగా బ్యాటర్లకు అనుకూలిస్తోంది.

కాబట్టి ఇరుజట్ల మధ్య అన్ని విభాగాల్లో ప్లేయర్ల ఆటతీరుపైనే అంతా ఆధారపడి ఉంటుంది. క్యాచ్‌‌‌‌లు జారవిడవకుండా, వచ్చిన అవకాశాలను వృథా చేయకుండా, బౌలర్లు రన్స్‌‌‌‌ను కాపాడే ప్రయత్నం చేస్తే మ్యాచ్‌‌‌‌లో పైచేయి సాధించొచ్చు. వెస్టిండీస్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ మధ్యలో రూథర్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌ కొట్టిన ఒక సులభమైన క్యాచ్‌‌‌‌ను మయాంక్‌‌‌‌ యాదవ్‌‌‌‌ జారవిడవడం రెండో టీ20ల్లో నిర్ణయాత్మకంగా మారింది. 

హోప్‌‌‌‌తో కలిసి రూథర్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌ 54 బాల్స్‌‌‌‌లో 120 రన్స్‌‌‌‌ భాగస్వామ్యాన్ని జోడించి మ్యాచ్‌‌‌‌ను గెలుపు దిశగా తీసుకెళ్లాడు. క్యాచ్‌‌‌‌ వదిలేసే సమయానికి రూథర్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌ 38 రన్స్‌‌‌‌ వద్ద ఉన్నాడు. కాబట్టి ఈ మ్యాచ్‌‌‌‌లో గెలవాలంటే ప్రతి అంశంలోనూ అప్రమత్తత చాలా అవసరం.

వైభవ్‌‌‌‌కు నో చాన్స్‌‌‌‌..
రెండో టీ20లో ఆడిన జట్టునే ఈ మ్యాచ్‌‌‌‌లోనూ యథాతథంగా బరిలోకి దించాలని టీమిండియా మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ భావిస్తోంది. ఓపెనర్లుగా అభిషేక్‌‌‌‌, శాంసన్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లు ఖాయం. కాబట్టి వండర్‌‌‌‌ కిడ్‌‌‌‌ వైభవ్‌‌‌‌ సూర్యవంశీకి చాన్స్‌‌‌‌ దక్కడం కష్టమే. ఓపెనర్లను ఎట్టి పరిస్థితుల్లో మార్చబోమని ఇప్పటికే హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ గంభీర్‌‌‌‌ కూడా స్పష్టం చేశాడు. శాంసన్‌‌‌‌ కూడా ఫామ్‌‌‌‌లోకి రావడం గౌతీ వ్యాఖ్యలకు మరింత బలాన్నిచ్చింది. కెప్టెన్‌‌‌‌ శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లోకి రావడం శుభసూచకం.

అయితే నాలుగో ప్లేస్‌‌‌‌లో శివమ్‌‌‌‌ దూబేను ఆడించడం వల్ల ప్రయోగాలు కొనసాగిస్తామని మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ స్పష్టమైన సంకేతాలిచ్చింది. మిగతా బ్యాటర్ల నుంచి పెద్దగా ఇబ్బందుల్లేవు. బౌలింగ్‌‌‌‌లో పేసర్‌‌‌‌ అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ నుంచి మరింత మెరుగైన ప్రదర్శనను ఆశిస్తున్నారు. గత రెండు మ్యాచ్‌‌‌‌ల్లో 79 రన్స్‌‌‌‌ ఇచ్చి ఒక్క వికెట్‌‌‌‌ తీయడం కలవరపెడుతోంది. మయాంక్‌‌‌‌ యాదవ్‌‌‌‌ అదే ఫామ్‌‌‌‌ను కొనసాగించాలని టీమిండియా కోరుకుంటోంది. స్పిన్నర్లు రన్స్‌‌‌‌ కట్టడి చేయడంతో పాటు కీలక టైమ్‌‌‌‌లో వికెట్లు తీస్తే కరీబియన్లను కట్టడి చేయొచ్చు.

హోప్‌‌‌‌తో ప్రమాదమే..
ఈ టూర్‌‌‌‌లో ఇప్పటికే రెండు సెంచరీలు చేసిన విండీస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ షై హోప్‌‌‌‌ నుంచి టీమిండియాకు అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది. అతన్ని త్వరగా ఔట్‌‌‌‌ చేయకపోతే మరోసారి పరుగుల సునామీ ఖాయం. బౌలర్‌‌‌‌ ఎవరైనా తన ఫామ్‌‌‌‌, నైపుణ్యంతో అద్భుతంగా ఆడుతున్నాడు. హోప్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌లో ఒక్క లోటును కూడా ఇండియా బౌలర్లు కనిపెట్టలేకపోతున్నారు. కాబట్టి ఈ మ్యాచ్‌‌‌‌లో హోప్‌‌‌‌ను త్వరగా ఔట్‌‌‌‌ చేసేందుకు మనోళ్లు మ్యాజిక్‌‌‌‌ బాల్‌‌‌‌ను కనిపెట్టాల్సిందే.

తొలి రెండు మ్యాచ్‌‌‌‌ల్లో హాఫ్‌‌‌‌ సెంచరీలతో విరుచుకుపడిన రూథర్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌ కూడా సూపర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉన్నాడు. చివర్లో రొమారియో షెఫర్డ్‌‌‌‌ హార్డ్‌‌‌‌ హిట్టింగ్‌‌‌‌తో స్కోరు బోర్డును పరుగెత్తిస్తున్నాడు. వీళ్ల ముగ్గురితో పాటు హెట్‌‌‌‌మయర్‌‌‌‌, పావెల్‌‌‌‌ కూడా బ్యాట్‌‌‌‌ ఝుళిపిస్తే ఈ మ్యాచ్‌‌‌‌లోనూ పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. బౌలింగ్‌‌‌‌లో రోస్టన్‌‌‌‌ ఛేజ్‌‌‌‌ అద్భుతంగా ఆడుతుండటం సానుకూలాంశం. అయితే షామెర్‌‌‌‌ స్ప్రింగర్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో కొత్త బౌలర్‌‌‌‌ను తీసుకునే చాన్స్‌‌‌‌ ఉంది.

తుది జట్లు (అంచనా)

ఇండియా: శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), అభిషేక్‌‌‌‌ శర్మ, సంజూ శాంసన్‌‌‌‌, ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌, తిలక్‌‌‌‌ వర్మ, నమన్‌‌‌‌ ధీర్‌‌‌‌, నితీష్‌‌‌‌ కుమార్‌‌‌‌ / శివమ్‌‌‌‌ దూబే, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌, మయాంక్‌‌‌‌ యాదవ్‌‌‌‌, కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌.

వెస్టిండీస్‌‌‌‌: షై హోప్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), కామిల్‌‌‌‌ పూరన్‌‌‌‌, హెట్‌‌‌‌మయర్‌‌‌‌, రొవ్‌‌‌‌మన్‌‌‌‌ పావెల్‌‌‌‌, షెర్ఫానే రూథర్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌, రొమారియో షెఫర్డ్‌‌‌‌, రోస్టన్‌‌‌‌ ఛేజ్‌‌‌‌, షామెర్‌‌‌‌ స్ప్రింగర్‌‌‌‌, అకిల్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌, షామెర్‌‌‌‌ జోసెఫ్‌‌‌‌, గుడకేశ్‌‌‌‌ మోతీ.