బంగ్లాదేశ్‌‌‌‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌.. అఫ్గానిస్తాన్‌‌‌‌ 211/4

బంగ్లాదేశ్‌‌‌‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌.. అఫ్గానిస్తాన్‌‌‌‌ 211/4

అబుదాబి: బంగ్లాదేశ్‌‌‌‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌‌‌‌లో అఫ్గానిస్తాన్‌‌‌‌ నిలకడగా ఆడుతోంది. కెప్టెన్‌‌‌‌ రహమత్‌‌‌‌ షా (84 బ్యాటింగ్‌‌‌‌), అబ్దుల్‌‌‌‌ మాలిక్‌‌‌‌ (62) హాఫ్‌‌‌‌ సెంచరీలు సాధించడంతో.. శనివారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌కు అఫ్గాన్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 79 ఓవర్లలో 211/4 స్కోరు చేసింది. ఇక్రామ్‌‌‌‌ అలికిల్‌‌‌‌ (26 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నాడు. షాహిదుల్లా (20), సెదికుల్లా అటల్‌‌‌‌ (17), హష్మతుల్లా షాహిది (0) నిరాశపర్చారు.

ఎబాదత్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు 317/8 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన బంగ్లాదేశ్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 92.3 ఓవర్లలో 346 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. నయీమ్‌‌‌‌ హసన్‌‌‌‌ (35 ) ఫర్వాలేదనిపించాడు. మహ్మద్‌‌‌‌ సలీమ్‌‌‌‌ 4, యామిన్‌‌‌‌ అహ్మద్‌‌‌‌జాయ్‌‌‌‌ 3 వికెట్లు తీశారు.