డర్బన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా మెరుగైన స్కోరు చేసింది. మ్యాట్ రెన్‌షా (190) భారీ సెంచరీతో చెలరేగడంతో.. 187/6 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం రెండో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 137.2 ఓవర్లలో 390 రన్స్‌కు ఆలౌటైంది.
పాట్ కమిన్స్ (43), నాథన్ లైయన్ (27) ఫర్వాలేదనిపించారు. వియాన్ ముల్డర్ 4, మార్కో యాన్సెన్ 3, అన్రిచ్ నోర్జ్ 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 8.4 ఓవర్లలో 27/1 స్కోరు చేసింది. మార్‌క్రమ్ (15 బ్యాటింగ్), బెడింగ్‌హామ్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
