భారత్ vs శ్రీలంక మ్యాచ్‌ స్టేడియం మార్పు.. ఢిల్లీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్!

భారత్ vs శ్రీలంక మ్యాచ్‌ స్టేడియం మార్పు.. ఢిల్లీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్!

India vs Sri Lanka: డిసెంబర్‌లో భారత పర్యటనకు రానున్న శ్రీలంక సిరీస్‌కు సంబంధించి ఒక కీలకమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఇండియా వర్సెస్  శ్రీలంక జట్ల మధ్య డిసెంబర్ 13వ తేదీన జరగాల్సిన తొలి వన్డే (1st ODI) వేదిక మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆధునికీకరణ పనుల కారణంగా ఈ మ్యాచ్‌ను మరొక వేదికకు తరలించే ప్రణాళికలు జరుగుతున్నట్లు క్రీడా వర్గాల్లో జోరుగా ప్రచారం కొనసాగుతోంది.

అరుణ్ జైట్లీ స్టేడియం అందుబాటులో లేకపోవడమే: 

* ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) అరుణ్ జైట్లీ స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రీనోవేషన్ పనులు చేపట్టాలని చూస్తోంది. 

* డ్రైనేజీ, పిచ్ ఆధునికీకరణ: వర్షం పడినప్పుడు మైదానంలో నీరు త్వరగా బయటకు వెళ్లేలా మెరుగైన సబ్‌ఫేస్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు పిచ్‌లు, ఔట్‌ఫీల్డ్‌ను ఆధునీకరించే పనులు ప్రారంభం కానున్నాయి.

* ఈ పునరుద్ధరణ పనులు పూర్తవడానికి కొన్ని నెలల సమయం పట్టే ఛాన్స్ ఉండటంతో అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు 2026–27 రంజీ ట్రోఫీ సీజన్‌లో గుజరాత్, సర్వీసెస్ జట్లతో ఢిల్లీ ఆడే మ్యాచ్‌లను పాలమ్ గ్రౌండ్‌కు తరలించే అవకాశం ఉంది.

అహ్మదాబాద్‌కు తొలి వన్డే మార్పు: 

* ఢిల్లీ వేదికగా జరగాల్సిన తొలి వన్డేను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియానికి మార్చే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

* ఈ వేదిక మార్పుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా బయటకు రాలేదు. 

* ప్రకటన వచ్చిన తర్వాతే ప్రత్యామ్నాయ వేదికపై పూర్తి క్లారిటి వచ్చే ఛాన్స్ క్లియర్ గా కనిపిస్తోంది. 

భారత్ వర్సెస్ శ్రీలంక సిరీస్ షెడ్యూల్: 

వన్డే సిరీస్ (ODI Series):

* 1వ వన్డే: డిసెంబర్ 13 - ఢిల్లీ (వేదిక మార్పు ప్రతిపాదనలో ఉంది)

* 2వ వన్డే: డిసెంబర్ 16 - బెంగళూరు

* 3వ వన్డే: డిసెంబర్ 19 - అహ్మదాబాద్

టీ20 సిరీస్ (T20I Series):

* 1వ టీ20: డిసెంబర్ 22 - రాజ్‌కోట్

* 2వ టీ20: డిసెంబర్ 24 - కటక్

* 3వ టీ20: డిసెంబర్ 27 - పుణె