తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం, టీవీకే అధినేత సి. జోసెఫ్ విజయ్‌ను అక్టోబర్ 10, 2026న చెన్నైలో భేటీ అయ్యారు. తొలుత విజయ్ నివాసంలో సుమారు గంటపాటు సమావేశమైన ఇరువురు నేతలు, ఆ తర్వాత సమీపంలోని కేఫ్‌కు వెళ్లి కాఫీ తాగారు. ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.విజయ్ నివాసంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర, జాతీయ రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
సమావేశం అనంతరం ఇద్దరూ సమీపంలోని కేఫ్‌కు వెళ్లారు. అక్కడ కాపుచినో కాఫీ, తిరమిసు, కుకీలు తీసుకున్నట్లు పీటీఐ వార్తా కథనం పేర్కొంది. కాంగ్రెస్, టీవీకే కలిసి పనిచేస్తున్న క్రమంలో కూటమి ఉమ్మడి కనీస కార్యక్రమం, భవిష్యత్తు ఎన్నికల ప్రణాళికలపై చర్చించే అవకాశం ఉందని సమావేశానికి ముందు వార్తలు వచ్చాయి. అయితే చర్చించిన ప్రతి అంశంపై అధికారిక ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
ALSO READ ; యువతను చూసి ప్రభుత్వం భయపడుతోంది..
చెన్నైలోని ఐలాండ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ‘ఛత్రోన్ కి గూంజ్’ (మానవర్గళిన్ కురల్) విద్యార్థుల కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ తమిళనాడుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడనున్నారు రాహుల్ . విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీతో జరిగిన ఈ భేటీ..కాంగ్రెస్, టీవీకే రాజకీయ సంబంధాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
