ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జంతర్ మంతర్ 2.0 నిరసనలు ఉధృతమయ్యాయి. నిరసనకారులను అడ్డుకునేందుకు భారీగా పోలీసులను మోహరించడంపై ప్రముఖ ఆర్థికవేత్త జీన్ డ్రెజ్ తీవ్రంగా విమర్శించారు. యువతను చూసి ప్రభుత్వం భయపడుతోందని అని అన్నారు. నిరసనకు వచ్చిన వారిని అడ్డుకునేందుకు భారీగా పోలీసులను మోహరించడం, బారికేడ్లు ఏర్పాటు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. హింస జరిగే అవకాశం ఉందని, భద్రతకు ముప్పు ఉందని చెబుతూ ఇంత పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించడం సరికాదన్నారు. నిరసనకు వస్తున్న యువతను చూసి ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు.
సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ సీఈసీ జ్ణానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని సవరించాలని కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ 2.0 నిరసనలు చేపట్టారు. ఈనిరసనలో వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, యువత దేశం నలుమూలలనుంచి రాజధాని ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఇప్పటికే వేల మంది ఢిల్లీలో నిరసనల్లో పాల్గొన్నారు.
ఎస్ఐఆర్, సీఈసీ జ్ణానేష్ కుమార్ కు వ్యతిరేకంగా నిరసన..
ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను వ్యతిరేకిస్తూ సీజేపీ ఆద్వర్యంలో జెన్ జీలు ఈ నిరసనలు చేపట్టారు. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన 2023 చట్టాన్ని కూడా నిరసనకారులు వ్యతిరేకించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన క్రమంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో జీన్ డ్రెజ్‌తో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎవరీ జీన్ డ్రెజ్?
జీన్ డ్రెజ్ బెల్జియంలో జన్మించిన ప్రముఖ ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త. భారతదేశంలో పేదరికం, ఆకలి నిర్మూలన, ఉపాధి హామీ, విద్య, వైద్యం వంటి అంశాలపై చాలా కాలంగా పనిచేస్తున్నారు. పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చేయడం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని ఆయన పలు సందర్భాల్లో తన అభిప్రాయాలను వెల్లడించారు. 2002లో ఆయన భారత పౌరసత్వం పొందారు.
#WATCH | Delhi: At Jantar Mantar, where Cockroach Janta Party (CJP) has called a protest, economist Jean Drèze says, "On behalf of all those who are not able to reach here because of the incredible display of force, which is completely out of proportion. The reason why the government is so afraid is not that there is any risk of violence or any security risk, it is that the government is afraid that the people of this country will understand that their right to vote is being taken away."
— ANI (@ANI) October 10, 2026
