మిథాని డిపో ఆర్టీసీ ఎన్నికలు.. ఎంప్లాయిస్ యూనియన్ కూటమి విజయం

మిథాని డిపో ఆర్టీసీ ఎన్నికలు.. ఎంప్లాయిస్ యూనియన్ కూటమి విజయం

హైదరాబాద్: మిథాని ఆర్టీసీ బస్ డిపోలో నిర్వహించిన టీఎస్‌ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ (EU) కూటమి విజయం సాధించింది. ALO, ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 472 ఓట్లు పోల్ కాగా ఎంప్లాయిస్ యూనియన్‌కు 279 ఓట్లు రాగా, తెలంగాణ వర్కర్స్ యూనియన్‌కు 193 ఓట్లు వచ్చాయి. దీంతో 86 ఓట్ల మెజారిటీతో ఎంప్లాయిస్ యూనియన్ కూటమి గెలుపొందింది. ఎన్నికల ఫలితాలతో ఎంప్లాయిస్ యూనియన్ కూటమి నేతలు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు.