మహాలయ అమావాస్య ఎప్పుడు ప్రారంభమైంది.. ఎప్పుడు ముగిసింది.. పితృ దేవతలకు ఏ సమయంలో తర్పణాలు వదలాలి.. మహాలయ అమావాస్య ఘడియలు ఎప్పటి వరకు ఉన్నాయి. అక్టోబర్ 10న పితృదేవతలను ఏ సమయంలో పూజించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
బాధ్రపద అమావాస్యతో పితృ పక్షాలు పరి సమాస్తమవుతాయి. ఇక వారసులు ఇచ్చిన ఆహారం.. నీళ్లు తీసుకొని మళ్లీ వారి ప్రయాణం కొనసాగిస్తారు. పితృ దేవతలను మహాలయ పక్షాల్లో పూజించకపోతే వారి ఆత్మ శాంతించక దోషాలు వెంటాడుతాయని గరుడ పురాణం ద్వారా తెలుస్తుంది.
ఈ ఏడాది ( 2026) అక్టోబర్ 10న పితృ అమావాస్య.. మహాలయ అమావాస్య వచ్చింది. ఆరోజు కచ్చితంగా పితృ దేవతలను పూజించాలి. పూర్వీకుల, పితృ దేవతల తిథి గుర్తు లేని వారు, పితృ పక్షంలో తర్పణాలు వదలలేని వారు ఆ రోజున పితృ తర్పణం, పిండ ప్రదానం, అన్నదానం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా చేయడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, వంశాభివృద్ధికి దోహదపడుతుందని పెద్దలు చెబుతారు.
ఈ ఏడాది ( 2026) పితృ అమావాస్య ను అక్టోబర్ 10 శనివారం నాడు జరుపుకొంటారు. పంచాంగం ప్రకారం 9వ తేదీ రాత్రి 9:35 గంటలకు ప్రారంభమై, 10వ తేదీ రాత్రి 9:19 గంటల వరకు అమావాస్య తిథి ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం తర్పణాలు శనివారం నిర్వహిస్తారు.
పితృదేవతలను పూజించేందుకు శుభ ముహూర్తం
అక్టోబర్ 10: కుదువ ముహూర్తం.. ఉదయం 11:34 నుంచి మధ్యాహ్నం 12:21 వరకు..
అక్టోబర్ 10: రోహిణి ముహూర్తం : మధ్యాహ్నం 12:21 నుంచి 1:07 వరకు
మధ్యాహ్న కాలం: అపరాన్న ముహూర్తం: మధ్యాహ్నం 1:07 నుండి 3:28 వరకు
నీళ్లు, నువ్వులు, బియ్యం తో తర్పణాలు వదిలేవారు కుదువ, రోహిణి ముహూర్త సమయాల్లో తర్పణాలు వదిలి అపరాన్న సమయంలో స్వయంపాక దానం ఇవ్వాలి. అన్నశ్రార్ధం పెట్టేవారు అపరాన్న సమయంలో పిండ ప్రదానం చేయాలని పండితులు చెబుతున్నారు.
