న్యూఢిల్లీ : బంగారం ధర గురువారం రెండు రోజుల నష్టాల తర్వాత స్వల్పంగా పుంజుకుంది. పండుగల సీజన్ దృష్ట్యా జ్యువెలర్లు, రిటైలర్ల నుంచి కొనుగోళ్లు పెరగడంతో ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి (24 క్యారెట్లు) ధర రూ.3,600 పెరిగి రూ.1,52,500కి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. బుధవారం రూ.1,48,900 వద్ద ముగిసింది. హైదరాబాద్‌లో రూ.1,54,700 దగ్గర ఉంది. ఈ ధరల్లో మేకింగ్ ఛార్జీలు కలిసి లేవు.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,111 డాలర్ల వద్ద స్వల్ప లాభంతో కదలాడుతోంది. అయితే, పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 105 డాలర్లకు ఎగబాకడం, డాలర్ బలపడడంతో పసిడి ధరలు ఎక్కువగా పెరగడం లేదు.
మరోవైపు వెండి ధరలు మాత్రం పడుతున్నాయి. కిలో వెండి గురువారం రూ.3 వేలు క్షీణించి రూ.2.24 లక్షల వద్ద స్థిరపడింది. జూన్ 29 తర్వాత ఇది మూడు నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. గ్లోబల్ మార్కెట్లో వెండి 2 శాతం పైగా నష్టపోయి ఔన్సుకు 58.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
