- వనపర్తి జిల్లా పెబ్బేరులో ఘటన .
పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ శివారులోని మహిళా పాలిటెక్నిక్ కాలేజీ హాస్టల్ స్టూడెంట్లు బుధవారం రాత్రి డిన్నర్లో చికెన్ తిని అస్వస్థతకు గురయ్యారు. -50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి కాగా గుట్టుచప్పుడు కాకుండా హాస్టల్ వార్డెన్ భర్త వారిని పెబ్బేరు పీహెచ్‌సీకి తీసుకువచ్చి వైరల్ ఫీవర్ వచ్చిందని టెస్ట్‌లు చేయించారు. ఫుడ్ పాయిజన్ కాలేదని, జ్వరం వచ్చిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. హాస్టల్లో నిర్వహించిన హెల్త్ క్యాంప్‌లో 22 మందికి వైరల్ ఫీవర్ ఉన్నట్లు తేలిందని చెబుతున్నారు.
విషయం తెలుసుకున్న పెబ్బేరు మున్సిపల్ చైర్పర్సన్శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ దయాకర్ రెడ్డి స్టూడెంట్లను పరామర్శించారు. ఓ స్టూడెంట్ అస్వస్థతకు గురవగా, చైర్పర్సన్ తనకారులో పీహెచ్‌సీకి తరలించారు. ఇదిలాఉంటే విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురి కాలేదని, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న స్టూడెంట్లు చికెన్ తినడంతో అజీర్ణం(ఫుడ్ కాంటామినేషన్)తో హెల్త్ ఇష్యూ వచ్చిందని అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్ తెలిపారు. డీఎంహెచ్‌వో భాస్కర్‌తో కలిసి ఆయన పాలిటెక్నిక్ కాలేజీ హాస్టల్‌ను సందర్శించారు.
