మరణంలోనూ వీడని బంధం.. భర్త కన్నుమూసిన గంటల వ్యవధిలోనే భార్య మృతి

మరణంలోనూ వీడని బంధం.. భర్త కన్నుమూసిన  గంటల వ్యవధిలోనే భార్య మృతి

ఏడడుగుల బంధం ఏడు జన్మల వరకు విడిపోని సంబంధం అనే మాట కొందరి జీవితాల్లో నిజమనిపిస్తుంటుంది. జీవితాంతం కలిసున్న దంపతులు మరణంలోనూ కలిసే తనవు చాలించడం అరుదుగా జరుగుతుంటుంది. జనగామ జిల్లాలో భర్త మరణాన్ని తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. 

వివరాల్లోకి వెళ్తే.. స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లులో భర్త లోకనాథం (84) 2026 నవంబర్ 20 రాత్రి 9 గంటల 50 నిమిషాలకు కన్నుమశారు. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య రామక్క (75) తెల్లవారుజామున మృతి చెందారు. 

 గంటల వ్యవధిలోనే దంపతులు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ పెద్దలు ఇద్దరూ ఒకేసారి చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.