టీసీఎస్ లాభం 15 శాతం జంప్... రెండో క్వార్టర్లో రూ. 13వేల 884 కోట్లు..షేరుకు రూ. 12 చొప్పున డివిడెండ్..   

టీసీఎస్ లాభం 15 శాతం జంప్... రెండో క్వార్టర్లో రూ. 13వేల 884 కోట్లు..షేరుకు రూ. 12 చొప్పున డివిడెండ్..   

ముంబై : భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌‌‌‌‌‌‌‌) ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ2)లో అదరగొట్టింది.  కంపెనీ నికర లాభం ఏడాది లెక్కన 15 శాతం పెరిగి రూ. 13,884 కోట్లకు చేరుకుంది.  కిందటేడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ. 12,075 కోట్లు. క్యూ2లో  కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 11.22 శాతం వృద్ధి చెంది రూ. 73,188 కోట్లకు  పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో అన్ని విభాగాల నుంచి స్థిరమైన వృద్ధి నమోదైందని కంపెనీ సీఈఓ కె. కృతివాసన్ తెలిపారు. 

ఏఐ విభాగం వార్షిక ఆదాయం జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 2.6 బిలియన్ డాలర్ల నుంచి 3 బిలియన్ డాలర్లకు పెరిగిందని అన్నారు.  కొత్త ఒప్పందాల విలువ (టీసీవీ) 9.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 

గత మూడు నెలల్లో నికరంగా 4,258 మంది ఉద్యోగులను చేర్చుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 5,98,056కు చేరింది. ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) 13.3 శాతంగా ఉంది. బోర్డు ప్రతి షేరుకు రూ. 12 మధ్యంతర డివిడెండ్‌‌‌‌‌‌‌‌ను సిఫార్సు చేసింది. దీనికి రికార్డు తేదీగా అక్టోబర్ 14ను నిర్ణయించింది.