జ్ఞానేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌కు సెక్యూరిటీ టైట్.. జడ్ ప్లస్‎కు అదనంగా సీఐఎస్ఎఫ్ రక్షణ

జ్ఞానేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌కు సెక్యూరిటీ టైట్.. జడ్ ప్లస్‎కు అదనంగా సీఐఎస్ఎఫ్ రక్షణ
  • ఇంటి వద్ద 24 గంటలూ పోలీసుల పహారా
  • నిరసనల వేళ అదనపు బలగాలు
  • ఢిల్లీ, ఆగ్రా నివాసాల వద్ద భద్రతపై పునఃసమీక్ష
  • నిర్వాచన్ సదన్ వద్ద సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్, 
  • సీఆర్‌‌‌‌‌‌‌‌పీఎఫ్, ఢిల్లీ పోలీసుల మోహరింపు

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌‌‌‌కు భద్రతను మరింత పెంచారు. ఆయనకు ఇప్పటికే జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండగా, దాని పరిధిని విస్తరించి అదనపు సిబ్బందిని మోహరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆయన నివాసం, ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద కూడా అదనపు బలగాలను మోహరించారు. ఇండియా కూటమి నేతలు గురువారం కూడా ఆయనకు వ్యతిరేకంగా నిరసనకు సిద్ధమవుతుండగానే ఈ చర్యలు తీసుకున్నారు.

ఇంటి వద్ద 24 గంటల పహారా

ఢిల్లీలోని ఆయన నివాసం చుట్టుపక్కల ఇకపై 24 గంటలూ పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుత ముప్పు అంచనాల దృష్ట్యా భద్రతను పెంచినట్టు వర్గాలు తెలిపాయి. ఆయన వ్యక్తిగత భద్రతకు తోడు, నివాసం వద్ద కూడా అదనపు బలగాలు ఉంటాయని చెప్పాయి. ఢిల్లీ, ఆగ్రాల్లో ఆయన ఇంటి వద్ద జరిగిన నిరసనల తర్వాత అధికారులు ముప్పును మరోసారి అంచనా వేశారు. 

కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రాలోని ఆయన ఇంటి వద్దకు వెళ్లి నినాదాలు చేశారని, ఇంటి ప్రధాన ద్వారం, గోడపై స్ప్రే పెయింట్‌‌‌‌తో నినాదాలు రాసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల ఆధారంగా ఆయనకు జెడ్ ప్లస్ భద్రత పరిధిని పెంచాలని నిర్ణయించారు. దీంతోపాటు ఎన్నికల సంఘం కార్యాలయం నిర్వచన్ సదన్ వద్ద సీఐఎస్ఎఫ్‌‌‌‌తోపాటు ఆర్ఏఎఫ్, సీఆర్‌‌‌‌పీఎఫ్, ఢిల్లీ పోలీసుల అదనపు సిబ్బందిని మోహరించారు.