హైదరాబాద్, వెలుగు: క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టామార్ట్ క్విక్ ఇండియా మూవ్‌మెంట్ సేల్‌ను ప్రారంభించింది. ఇన్‌స్టామార్ట్, స్విగ్గీ యాప్‌లలో అందుబాటులోకి వచ్చిన ఈ సేల్‌లో నిత్యావసర సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు 50–90 శాతం వరకు భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. కేవలం రూ.9 నుంచే స్నాక్స్, లడ్డూలు, డ్రైఫ్రూట్ చిక్కీలు అందుబాటులో ఉన్నాయి.
యాపిల్ ఐఫోన్ 17 ప్రో, యాపిల్ మ్యాక్‌బుక్స్, బాష్ మిక్సర్ గ్రైండర్, జేబీఎల్ స్పీకర్‌పై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. బ్యూటీ ప్రొడక్టులపై 80 శాతం వరకు, గృహోపకరణాలపై 90 శాతం వరకు రాయితీలు ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులకు గరిష్ఠంగా రూ.5,500 వరకు అదనపు తగ్గింపు లభిస్తుందని ఇన్‌స్టామార్ట్ తెలిపింది.
