హైదరాబాద్, వెలుగు: ఈ–-కామర్స్ కంపెనీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ను గురువారం ప్రారంభించింది. లక్షలాది ఉత్పత్తులపై అతి తక్కువ ధరలను అందిస్తున్నామని తెలిపింది. మెట్రో నగరాల కస్టమర్లకు అమెజాన్ నౌ ద్వారా ఐఫోన్ 16ను రికార్డు స్థాయి తక్కువ ధరకు నిమిషాల్లోనే డెలివరీ ఇస్తారు.
ప్రైమ్ సభ్యులకు ప్రత్యేక పొదుపు ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని ఉత్పత్తులపై అదనంగా 5 శాతం తగ్గింపుతో పాటు రూ.250 క్యాష్‌బ్యాక్ అందజేస్తున్నారు. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది.
ప్రైమ్ సభ్యులు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఫ్లిప్కార్ట్ కూడా బిగ్ బిలియన్ డేస్ పేరుతో సేల్ప్రారంభించింది. ఐసీఐసీఐ, యాక్సిస్బ్యాంకు కార్డులతో కొంటే ఇన్స్టంట్ డిస్కౌంట్లు ఉంటాయి.
