ఆర్కిటిక్‌‌ ఓపెన్‌‌ లో  క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో సింధు..

ఆర్కిటిక్‌‌ ఓపెన్‌‌ లో  క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో సింధు..

వాంటా (ఫిన్లాండ్‌‌): రెండుసార్లు ఒలింపిక్‌‌ మెడలిస్ట్‌‌ పీవీ సింధు.. ఆర్కిటిక్‌‌ ఓపెన్‌‌లో క్వార్టర్‌‌ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన విమెన్స్‌‌ ప్రిక్వార్టర్స్‌‌లో ఆరోసీడ్‌‌ సింధు 21–15, 21–15తో రికో గుంజి (జపాన్‌‌)పై గెలిచింది. 49 నిమిషాల మ్యాచ్‌‌లో ఇండియన్‌‌ ప్లేయర్‌‌కు గుంజి గట్టి పోటీ ఇచ్చింది. దాంతో తొలి గేమ్‌‌ 15–15 వరకు హోరాహోరీగా సాగింది. 

ఇక్కడి నుంచి బలమైన స్మాష్‌‌లతో చెలరేగిన సింధు వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి గేమ్‌‌ను సాధించింది. రెండో గేమ్‌‌లోనూ ప్రతి పాయింట్‌‌ కోసం ఇద్దరు హోరాహోరీగా పోటీపడ్డారు. ఓ దశలో గుంజి 12–11 ఆధిక్యంలో నిలిచినా దాన్ని కాపాడుకోలేకపోయింది. క్రాస్‌‌ కోర్టు విన్నర్లతో చెలరేగిన సింధు వరుసగా పాయింట్లు గెలిచి గేమ్‌‌తో పాటు మ్యాచ్‌‌ను సొంతం చేసుకుంది. 

మరో మ్యాచ్‌‌లో తన్వీ శర్మ 18–21, 7–21తో రచ్చనోవ్‌‌ ఇంతనోన్‌‌ (థాయ్‌‌లాండ్‌‌) చేతిలో ఓడింది. మెన్స్‌‌ సింగిల్స్‌‌లో తరుణ్‌‌ మానేపల్లి 14–21, 19–21తో క్రిస్టో పొపోవ్‌‌ (ఫ్రాన్స్‌‌) చేతిలో, కిడాంబి శ్రీకాంత్‌‌ 21–15, 15–21, 13–21తో బ్రియాన్‌‌ యంగ్‌‌ (కెనడా) చేతిలో ఓడారు.