శాంసన్‌‌ గాడిలో పడేనా...? ఇవాళ ( అక్టోబర్ 9 ) వెస్టిండీస్‌‌ తో ఇండియా రెండో టీ20..

శాంసన్‌‌ గాడిలో పడేనా...? ఇవాళ ( అక్టోబర్ 9 ) వెస్టిండీస్‌‌ తో ఇండియా రెండో టీ20..
  • ఓపెనర్‌‌గా వైభవ్‌‌ సూర్యవంశీకి చాన్స్‌‌!
  • రా. 7 నుంచి స్టార్‌‌ స్పోర్ట్స్‌‌లో లైవ్‌‌

రాంచీ: టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా బ్యాటింగ్‌‌ లైనప్‌‌లో ఒకే ఒక్క లోటు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అది ఓపెనర్‌‌ సంజూ శాంసన్‌‌ వైఫల్యం. ఇప్పుడు ప్రధానంగా అందరి దృష్టీ  దానిపైనే నెలకొంది. ఈ నేపథ్యంలో శుక్రవారం వెస్టిండీస్‌‌తో జరిగే రెండో టీ20 మ్యాచ్‌‌ కోసం ఇండియా టీమ్‌‌ రెడీ అయ్యింది. 

కేరళ బ్యాటర్‌‌ శాంసన్‌‌ గత నాలుగు ఇన్నింగ్స్‌‌ల్లో 9, 7, 2, 11 రన్స్‌‌ మాత్రమే చేశాడు. అభిషేక్‌‌, సూర్యవంశీతో కలిసి నెలకొల్పిన భాగస్వామ్యాలు కూడా 7, 12, 2, 29 రన్స్‌‌గా ఉన్నాయి. కాబట్టి శాంసన్‌‌ ప్లేస్‌‌లో వండర్‌‌ కిడ్‌‌ వైభవ్‌‌ సూర్యవంశీని ఓపెనర్‌‌గా ప్రమోట్‌‌ చేసే అంశంపై టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ ఫోకస్‌‌ చేస్తోంది. అయితే టీ20 కెప్టెన్‌‌ శ్రేయస్‌‌ అయ్యర్‌‌ సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌... శాంసన్‌‌ వైఫల్యాలను కప్పి పుచ్చినా సూర్యవంశీకి కూడా చాన్స్‌‌ ఇవ్వాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 

ఎందుకంటే ఇప్పటివరకు లభించిన పరిమిత అవకాశాల్లోనే సూర్యవంశీ తన సత్తాను నిరూపించుకున్నాడు. విభిన్నమైన షాట్లు ఆడటం, మ్యాచ్‌‌ గెలిపించే ఇన్నింగ్స్‌‌ ఆడగల నైపుణ్యం సూర్యవంశీకి క్రేజ్‌‌ను పెంచాయి. కానీ మేనేజ్‌‌మెంట్‌‌ మాత్రం అభిషేక్‌‌, శాంసన్‌‌ ఓపెనింగ్‌‌ జోడీకే మద్దతు ఇస్తోంది. ఆసియా క్రీడల్లో శాంసన్‌‌ను మూడో ప్లేస్‌‌లో ఆడించి వైభవ్‌‌ను ఓపెనర్‌‌గా పంపించి సక్సెస్‌‌ అయ్యారు. 

ఇప్పుడు కూడా అదే ఫార్ములాను ఉపయోగించాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు సూర్యవంశీ మీద ఒత్తిడి పెరిగి విఫలమైతే కెరీర్‌‌కే ప్రమాదం. కాబట్టి మేనేజ్‌‌మెంట్‌‌ కూడా ఆచితూచి అడుగేస్తోంది. ఓవరాల్‌‌గా వైభవ్‌‌ ప్లేస్‌‌ కంటే శాంసన్‌‌ ఫామ్‌‌లోకి రావడమే ఇప్పుడు అత్యంత ప్రధానమైన అంశం. 

పేస్ బౌలింగ్ కూర్పు

ఇండియా తమ పేస్‌‌ బౌలింగ్‌‌ కూర్పులో కూడా మార్పులు చేయాలని చూస్తోంది. తొలి టీ20లో మయాంక్‌‌ యాదవ్‌‌ తొలి ఓవర్‌‌లోనే 16 రన్స్‌‌ ఇచ్చాడు. తర్వాత కూడా ధారాళంగా రన్స్‌‌ సమర్పించుకున్నాడు. అయితే టాప్‌‌ స్కోరర్‌‌ రూథర్‌‌ఫోర్డ్‌‌ వికెట్‌‌ తీయడం అతనికి కలిసొచ్చింది. అయినప్పటికీ ఈ ప్రయోగం బెడిసికొట్టడంతో ఆల్‌‌రౌండర్‌‌ నితీశ్‌‌ కుమార్‌‌ను జట్టులోకి తీసుకుని కొత్త బంతిని అప్పగించాలని చూస్తున్నారు. సీనియర్‌‌ అక్షర్‌‌ పటేల్‌‌తో పాటు కుల్దీప్‌‌ యాదవ్‌‌ రాకతో స్పిన్‌‌ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. ఆఫ్‌‌ స్పిన్నర్‌‌ యువ ఆల్‌‌రౌండర్‌‌ నమన్‌‌ ధీర్‌‌ కూడా ఆకట్టుకున్నాడు. బౌలర్లు కుదురుకుంటే విండీస్‌‌ హిట్టర్లను కట్టడి చేయడం తేలికే.

భారీ స్కోరుపై దృష్టి..

తొలి మ్యాచ్‌‌లో 171 రన్స్‌‌ చేసినా విండీస్‌‌ దాన్ని కాపాడుకోలేకపోయింది. కాబట్టి రెండో టీ20లో ఇంకా భారీ స్కోరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది జరగాలంటే బ్యాటర్లు మరింత చెలరేగాలి. కెప్టెన్‌‌ షై హోప్‌‌, రూథర్‌‌ఫోర్డ్‌‌ హాఫ్‌‌ సెంచరీలు బాదినా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. హెట్‌‌మయర్‌‌, పావెల్‌‌, ఛేజ్‌‌, షెఫర్డ్‌‌లాంటి టీ20 హిట్టర్లు బ్యాట్లు ఝుళిపిస్తే ఈజీగా స్కోరు రెండు వందలు దాటుతుంది. 

ఎలాగూ స్టార్‌‌ పేసర్‌‌ బుమ్రా లేడు కాబట్టి కరీబియన్‌‌ బ్యాటర్లు చివరి వరకు క్రీజులో నిలబడితే రన్స్‌‌ వస్తాయి.  బౌలింగ్‌‌లో లెఫ్టార్మ్‌‌ స్పిన్నర్‌‌ అకిల్‌‌ హుస్సేన్‌‌ మాత్రమే ఫామ్‌‌లో ఉన్నాడు. మిగతా బౌలర్లు కూడా లయ అందుకుంటే టీమిండియాను కొద్దిగానైనా కట్టడి చేయొచ్చు. 

తుది జట్లు (అంచనా)

ఇండియా: శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (కెప్టెన్‌‌), అభిషేక్‌‌ శర్మ, సంజూ శాంసన్‌‌, ఇషాన్‌‌ కిషన్‌‌, తిలక్‌‌ వర్మ, శివమ్ దూబే, నమన్‌‌ ధీర్‌‌, అక్షర్‌‌ పటేల్‌‌, కుల్దీప్‌‌ యాదవ్‌‌, ప్రిన్స్‌‌ యాదవ్‌‌, అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌.

వెస్టిండీస్‌‌: షై హోప్‌‌ (కెప్టెన్‌‌), కామిల్‌‌ పూరన్‌‌, హెట్‌‌మయర్‌‌, రొవ్‌‌మన్‌‌ పావెల్‌‌, షెర్ఫానే రూథర్‌‌ఫోర్డ్‌‌, రొమారియో షెఫర్డ్‌‌, రోస్టన్‌‌ ఛేజ్‌‌, షామెర్‌‌ స్ప్రింజెర్‌‌, అకిల్‌‌ హుస్సేన్‌‌, షామెర్‌‌ జోసెఫ్‌‌, మాథ్యూ ఫోర్డి. 

పిచ్‌‌, వాతావరణం

రాంచీలో డేనైట్‌‌ మ్యాచ్‌‌లు ఎక్కువగా జరగడం లేదు. కాబ్టటి పిచ్‌‌ను అంచనా వేయడం కష్టంగా మారింది. 2023లో కివీస్‌‌ 176 రన్స్‌‌ లక్ష్యాన్ని కాపాడుకుంది. కాబట్టి తొలుత బ్యాటింగ్‌‌ చేయడం కరెక్ట్‌‌ కాదు. అదే టైమ్‌‌లో భారీ స్కోర్లు నమోదయ్యే చాన్స్‌‌ కూడా లేదు. వర్షం ముప్పు పెద్దగా లేదు.