హైదరాబాద్లో అక్టోబర్ 10న జాబ్ మేళా.. నాన్-ఐటీ జాబ్స్ కోసం చూస్తుంటే మాత్రం మంచి ఛాన్స్ !

హైదరాబాద్లో అక్టోబర్ 10న జాబ్ మేళా.. నాన్-ఐటీ జాబ్స్ కోసం చూస్తుంటే మాత్రం మంచి ఛాన్స్ !

హైదరాబాద్: నాన్-ఐటీ రంగాలలో ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో హైదరాబాద్లో జాబ్ మేళా నిర్వహించనున్నారు. అక్టోబర్ 10వ తేదీన ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు హైదరాబాద్, బంజారా హిల్స్ రోడ్, మాసాబ్ ట్యాంక్ దగ్గర ఉన్న ఖాజా మాన్షన్ ఫంక్షన్ హాల్‌లో ఈ జాబ్ మేళా జరగనుంది.

హైదరాబాద్, ఇతర జిల్లాల అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని నిర్వాహకుడు మన్నన్ ఖాన్ తెలిపారు. సుమారు 50 కంపెనీలు ఈ జాబ్ మేళాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు. అర్హులైన అభ్యర్థులు అక్కడికక్కడే ఆఫర్ లెటర్లను పొందవచ్చు.

ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు, ఫ్రెషర్లు, అనుభవజ్ఞులైన ఉద్యోగార్థులతో సహా, వారు ఏ సంవత్సరంలో ఉత్తీర్ణులయ్యారనే దానితో సంబంధం లేకుండా ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చు.

ఉద్యోగార్థులు తమ సీవీల (CV) 10 కాపీలను తీసుకువచ్చి, నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. వివరాల కోసం, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 8374315052 నంబరుకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.