డేటా సెంటర్లతో అనారోగ్య సమస్యలు రావు.. పాలసీ కన్సెన్సస్ సెంటర్ స్టడీ రిపోర్ట్ వెల్లడి

డేటా సెంటర్లతో అనారోగ్య సమస్యలు రావు.. పాలసీ కన్సెన్సస్ సెంటర్ స్టడీ రిపోర్ట్ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: డేటా సెంటర్ల సమీపంలో నివసించడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయనే వాదనలో నిజం లేదని ఒక స్టడీ తెలిపింది.  రోజువారీ జీవనానికి ఎటువంటి ఆటంకం కలగదని ముంబై వాసులు స్పష్టం చేశారని వెల్లడించింది. డేటా సెంటర్ల వల్ల నగరవాసులకు ఆరోగ్య సమస్యలు వచ్చినట్టు ఆధారాలు లేవని  పాలసీ కన్సెన్సస్ సెంటర్ రిపోర్ట్​  తెలిపింది. ఈ విషయమై నిర్వహించిన ప్రత్యేక వెబినార్‌‌‌‌‌‌‌‌లో నిపుణులు, విధానకర్తలు డేటా సెంటర్లపై సమగ్రంగా చర్చించారు.  
.
వేగంగా విస్తరిస్తున్న డేటా సెంటర్లు ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు స్వచ్ఛ ఇంధన రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు.  నగరాల విస్తరణలో భాగంగా సాంకేతిక పురోగతి, పర్యావరణ పరిరక్షణ రెండూ సమన్వయంతో సాగాలని సంస్థ సీఈఓ నిరుపమ సౌందరరాజన్ పేర్కొన్నారు. క్లౌడ్ సేవలు, ఏఐ విస్తరిస్తున్న కొద్దీ వ్యాపారాలకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తూ ఆర్థిక వ్యవస్థకు ఈ కేంద్రాలు  ఊతంగా మారుతున్నాయని వెల్లడించారు.