మంచిర్యాల, వెలుగు: నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్(ఎఫ్ఎస్వో) రవీందర్ టింబర్ డిపో రెన్యువల్ కోసం రూ.12వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఆదిలాబాద్ సర్కిల్ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్‌కు చెందిన రవితేజ టింబర్ డిపో పర్మిషన్ రెన్యువల్ కోసం గత ఆగస్టులో దరఖాస్తు చేశాడు.
అన్ని డాక్యుమెంట్స్ కరెక్టుగా ఉన్నప్పటికీ రెన్యువల్ చేయడానికి రూ.20 వేలు డిమాండ్ చేసి, రూ.12 వేలకు ఒప్పుకున్నాడు. దీంతో రవితేజ ఏసీబీని ఆశ్రయించాడు. అధికారుల సూచన మేరకు గురువారం రూ.12 వేలు ఎఫ్ఎస్వో రవీందర్‌కు ఆఫీస్‌లో ఇవ్వగా, ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రవీందర్‌ను అదుపులోకి తీసుకొని కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు డీఎస్పీ తెలిపారు.
