బంగారం రికవరీలో గోల్‌‌‌‌మాల్?..నార్కట్‌‌‌‌పల్లి ఎస్సై ఎస్పీ కార్యాలయానికి అటాచ్

బంగారం రికవరీలో గోల్‌‌‌‌మాల్?..నార్కట్‌‌‌‌పల్లి ఎస్సై ఎస్పీ కార్యాలయానికి అటాచ్

నార్కట్‌‌‌‌పల్లి, వెలుగు : దొంగతనం కేసులో నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం రికవరీలో తేడాలు ఉన్నాయన్న ఆరోపణలు నల్లగొండ జిల్లా పోలీసు వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై విచారణ అనంతరం నార్కట్‌‌‌‌పల్లి ఎస్సై విష్ణుమూర్తిని జిల్లా ఎస్పీ శరత్‌‌‌‌చంద్ర పవార్ గురువారం సాయంత్రం ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు సమాచారం. నార్కట్‌‌‌‌పల్లి మండలం జివ్విగూడెం గ్రామానికి చెందిన అలుగుబెల్లి రాము దొంగతనాలకు పాల్పడి పట్టుబడ్డాడు. మే, జూన్‌‌‌‌, జూలై నెలల్లో పోలీసులు విచారణ చేపట్టారు.

నిందితుడి నుంచి సుమారు 30 తులాల బంగారం రికవరీ చేసినట్లు సమాచారం. అయితే రికవరీ చూపించిన బంగారం వివరాల్లో తేడాలు ఉన్నట్లు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. మూడు రోజులుగా ఈ వ్యవహారం ఉమ్మడి నల్లగొండ జిల్లా పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరికొందరు అధికారులపై కూడా చర్యలు ఉండొచ్చన్న చర్చ సాగుతోంది. అయితే రికవరీలో తేడాలు, అధికారులపై వచ్చిన ఆరోపణలపై పోలీసు శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఎస్సై విష్ణుమూర్తి