హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లో జపాన్ ఫెస్టివల్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లో జపాన్ ఫెస్టివల్

హైదరాబాద్​, వెలుగు:  పర్యాటకులను ఆకట్టుకోవడానికి, జపనీస్‌ సంస్కృతిని పరిచయం చేసేందుకు శుక్రవారం హైదరాబాద్​లో జపాన్ ఫెస్టివల్ జరగనుంది.  జపాన్ హబ్ ఆధ్వర్యంలో, హైదరాబాద్ జపనీస్ అసోసియేషన్ సహకారంతో హైటెక్ సిటీలోని సైబర్ గార్డెన్స్‌‌‌‌‌‌‌‌లో ఈ కార్యక్రమాన్ని శుక్రవారం ఏర్పాటుచేస్తున్నారు.  

ప్రవేశం పూర్తిగా ఉచితం. నగరంలో తొలిసారిగా మియోషి సిటీ పప్పెట్ షో, ప్రత్యేక ఇకెబానా ఫ్లవర్​షో, ఇండియా–-జపాన్ ఇన్నోవేషన్ హ్యాకథాన్ అవార్డుల ప్రదానం ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. జపాన్​లో ఉన్నత విద్య, ఉద్యోగాలు, కెరీర్ అవకాశాలు, జపనీస్ భాషపై ఆసక్తి ఉన్న యువత కోసం ప్రత్యేక సెమినార్లు నిర్వహించనున్నారు.