హైదరాబాద్, వెలుగు: ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్–2 కోసం ప్రిత్విరాజ్ యోధాస్ 8 మందితో కూడిన జట్టును ప్రకటించింది. వరల్డ్ నవంబర్‌వన్ కాంపౌండ్ ఆర్చర్ ఆండ్రియా బెసెర్రా, వరల్డ్ మూడో ర్యాంకర్, రికర్వర్ ఆర్చర్ మాటియాస్ గ్రాండేతో పాటు అభిషేక్ వర్మ, కీర్తి శర్మ, తిరుమూరు గణేష్ మణిరత్నం, గాథా ఆనంద్రావ్ ఖడకే, రాజ్ కౌర్, జుయెల్ సర్కార్ జట్టులో ఉన్నారు. కాంపౌండ్, రికర్వ్ విభాగంలో ఆర్చర్లు బరిలోకి దిగనున్నారు.
ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఐ), వరల్డ్ ఆర్చరీ, వరల్డ్ ఆర్చరీ ఏషియా మద్దతుతో నిర్వహిస్తున్న ఏపీఎల్ సీజన్–2లో 10 దేశాలకు చెందిన 26 మంది ఇండియన్, 12 మంది ఇంటర్నేషనల్ ఆర్చర్లు పోటీపడుతున్నారు. మొత్తం 48 మంది ఆర్చర్లు ఆరు ఫ్రాంచైజీల తరఫున 11 రోజుల పాటు లీగ్‌లో పాల్గొంటారు.
ప్రిత్విరాజ్ యోధాస్‌కు నటులు రణదీప్ హుడా, లిన్ లైష్రామ్ సహయజమానులుగా ఉండగా, ఎబిక్స్ గ్రూప్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. వరల్డ్ నంబర్‌వన్ ఆర్చర్ మార్కస్ డి అల్మెయిడా, మెటె గాజోజ్, కేసీ కౌఫ్‌హోల్డ్‌తో పాటు కాంపౌండ్‌లో మైక్ ష్లోస్సర్, ఎల్లా గిబ్బన్, దీపికా కుమారి, అటాన్ దాస్, ధీరజ్ బొమ్మదేవర, జ్యోతి సురేఖ బరిలో ఉన్నారు.
