మంథని, వెలుగు: జర్నలిస్టులు ప్రజల పక్షాన నిలబడి నిష్పక్షపాతంగా వార్తలు రాయాలని టీయూడబ్ల్యూజే(143) యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ సూచించారు. గురువారం మంథని ప్రెస్‌క్లబ్‌కు వచ్చిన ఆయనను విలేకరులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. జర్నలిజం విలువలు, ప్రస్తుతం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమాజంలో వారి పాత్రపై వివరించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు అంకరి ప్రకాశ్, మంథని ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు అంకరి కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు జంజర్ల శంకర్, ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి పోతరాజు సమ్మయ్య, ఉపాధ్యక్షుడు బర్ల సంపత్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
