- నేటి నుంచి హైదరాబాద్, కాగజ్నగర్మీదుగా రాకపోకలు
కోల్‌బెల్ట్, వెలుగు : బతుకమ్మ, దసరా పండుగులను పురస్కరించుకొని సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్య రైల్వే 34 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనుంది. సికింద్రాబాద్–-సిర్పూర్ కాగజ్‌నగర్–-హైదరాబాద్ మధ్య ఈనెల 9 నుంచి 25 వరకు 17 రోజుల పాటు ప్రతిరోజూ వీటిని నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12.10 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరిన ప్రత్యేక రైలు( ట్రైన్ నెంబర్ 07711) సాయంత్రం 5.30 గంటలకు సిర్పూర్ కాగజ్నగర్చేరుకుంటుంది.
సాయంత్రం 6 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బయలుదేరే ప్రత్యేక రైలు(ట్రైన్ నెంబర్ 07712) రాత్రి 11.15 గంటలకు కు హైదరాబాద్ చేరుకుంటుందని రైల్వే ఆఫీసర్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు. ఎసీ చైర్‌కార్, సెకండ్సిట్టింగ్క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
