క్యూఆర్‌‌ ఏరియాలో ఇందిరమ్మ టవర్లకు 25 మంది సివిల్‌‌ ఇంజినీర్లు

 క్యూఆర్‌‌ ఏరియాలో ఇందిరమ్మ టవర్లకు 25 మంది సివిల్‌‌ ఇంజినీర్లు
  •     ఔట్‌‌సోర్సింగ్‌‌ పద్ధతిలో ఏడాది కాలానికి నియామకం
  •     21 వరకు దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్‌‌, వెలుగు: క్యూఆర్‌‌ ఏరియాలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్ల ప్రాజెక్టుకు కొత్తగా 25 మంది సివిల్‌‌ ఇంజనీర్లను నియమించనున్నారు. ఈ మేరకు హౌసింగ్‌‌ బోర్డు గురువారం నోటిఫికేషన్‌‌ జారీ చేసింది. ఔట్‌‌సోర్సింగ్‌‌ పద్ధతిలో ఏడాది కాలానికి వీరిని నియమించనున్నట్లు పేర్కొంది. ఒక్కో నియోజకవర్గానికి ఒకరు చొప్పున నియమించనున్నారు. హౌసింగ్‌‌ బోర్డులో అధికారులు, ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉండటంతో పాటు రెగ్యులర్‌‌ నియామకాలకు సమస్యలు ఉండటంతో ఔట్‌‌సోర్సింగ్‌‌ పద్ధతిలో సిబ్బందిని నియమిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

బీఈ, బీటెక్‌‌(సివిల్‌‌) పూర్తి చేసి, రెసిడెన్షియల్‌‌, ఇన్‌‌ఫ్రా రంగాల్లో రెండేండ్ల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. గురువారం నుంచి ఈనెల 21 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హౌసింగ్‌‌ బోర్డు వెబ్‌‌సైట్‌‌లోని గూగుల్‌‌ ఫామ్‌‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం మరో 51 మంది అసిస్టెంట్‌‌ ఇంజనీర్ (సివిల్‌‌) పోస్టులకు హౌసింగ్‌‌ కార్పొరేషన్‌‌ గురువారం నోటిఫికేషన్‌‌ జారీ చేసింది.