మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలం లింగ్య తండాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులను బానోత్ అనూష (35), ఆమె కుమారుడు విశాల్ కృష్ణ (5), కుమార్తె వర్షిణి (9)గా గుర్తించారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో లింగ్య తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు గల పూర్తి కారణాలు, ఇతర వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
