హైదరాబాద్ చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. మలక్‌పేట్ డి.మార్ట్ ఎక్స్ రోడ్డు వద్ద బైక్‌పై ప్రయాణిస్తున్న లావణ్య అనే మహిళ ప్రమాదవశాత్తు స్కిడ్ అయి ఆర్టీసీ బస్సు కింద పడటంతో తీవ్రంగా గాయపడి మృతి చెందింది.
సరూర్‌నగర్‌కు చెందిన లావణ్యకు ఆగస్టు 30న శ్రీకాంత్‌తో వివాహం జరిగింది. పెళ్లయి కొద్ది రోజులే కావడంతో ఈ ప్రమాద ఘటన కుటుంబ సభ్యులు, బంధువుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కొత్త జీవితాన్ని ప్రారంభించిన కొద్ది రోజులకే లావణ్య మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
